Alampur Municipal Results 2026: అలంపూర్‌లో మున్సిపల్ పోరు ‘టై’: కాంగ్రెస్ 5.. బీఆర్ఎస్ 5.. పీఠం దక్కేది ఎవరికి?

Alampur Municipal Results 2026: జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మున్సిపాలిటీ ఫలితాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి.

Arun Chilukuri
Published on: 13 Feb 2026 11:16 AM IST
Alampur Municipal Results 2026: అలంపూర్‌లో మున్సిపల్ పోరు ‘టై’: కాంగ్రెస్ 5.. బీఆర్ఎస్ 5.. పీఠం దక్కేది ఎవరికి?
X

Alampur Municipal Results 2026: జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మున్సిపాలిటీ ఫలితాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడింది. మొత్తం 10 వార్డులకు గాను ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు సమానంగా స్థానాలను పంచుకున్నాయి.

బలాబలాలు ఇలా:

కాంగ్రెస్ పార్టీ: 05 వార్డులు

బీఆర్ఎస్ పార్టీ: 05 వార్డులు

అలంపూర్‌లో ఇరు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడటంతో ఫలితం సమంగా నిలిచింది. పదికి పది వార్డుల్లోనూ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి చెరో ఐదు స్థానాలతో ఇరు పార్టీలు సరితూగాయి. దీంతో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎక్స్-అఫీషియో ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. ఇరు పార్టీల నేతలు గెలిచిన అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డారు. అలంపూర్ పీఠంపై ఏ పార్టీ జెండా ఎగురుతుందో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story