Top
logo

Alai Balai: ఇవాళ హైదరాబాద్‌ జలవిహార్‌లో అలయ్ బలయ్

Alai Balai Program in Hyderabad Jalvihar Today 17 10 2021
X

ఇవాళ హైదరాబాద్‌ జలవిహార్‌లో అలయ్ బలయ్(ఫైల్ ఫోటో)

Highlights

*ప్రతి యేడు దసరా తరువాత దత్తన్న అలయ్ బలయ్ *ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు

Alai Balai: ఇవాళ హైదరాబాద్‌ జలవిహార్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ప్రతి యేడు దసరా తరువాత బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలయ్ బలయ్‌కు అన్ని పార్టీల నేతలు, ప్రముఖులు రానున్నారు. ఈ సారి అలయ్ బలయ్‌కు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు కానున్నారు. తెలంగాణ, ఏపీ గవర్నర్లు, మంత్రులు, సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు రానున్నారు. అలయ్ బలయ్‌లో తెలంగాణ రుచులు నోరూరించనున్నాయి. కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Web TitleAlai Balai Program in Hyderabad Jalvihar Today 17 10 2021
Next Story