సింగరేణి కార్మికుల సంఘాల ఎన్నికల్లో AITUC ఘన విజయం

Singareni Election: 11 ఏరియాలో INTUCపై AITUC ఘన విజయం

Jyothi
Published on: 28 Dec 2023 7:48 AM IST
AITUC Won the Singareni Election
X

సింగరేణి కార్మికుల సంఘాల ఎన్నికల్లో AITUC ఘన విజయం

Singareni Election: సింగరేణి కాలరీస్ కార్మిక సంఘాల గుర్తింపు సంఘం ఎన్నికల్లో AITUC ఘన విజయం సాధించింది. సింగరేణి లో గుర్తింపు హోదా కోసం జరిగిన ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడ్డాయి. 11 ఏరియాలలో కౌంటింగ్ ముగిసిన అనంతరం INTUCపై AITUC విజయకేతనం ఎగరేసింది. శ్రీరాంపూర్ , మందమర్రి, రామగుండం ఏరియాల్లో AITUCకి భారీ మెజరిటీ లభించింది.

AITUC విజయం తో కొత్తగూడెం లో కార్మికులు సంబరాలు చేసుకున్నారు. జెండా లతో నినాదాలు చేస్తూ బాణాసంచా కాలుస్తూ విజయోత్సవం నిర్వహించారు. ప్రత్యర్థులు ప్రలోభాలు పెట్టినా అంతిమంగా కార్మికులు న్యాయంగా ఉద్యమ సంఘానికి పట్టం కట్టారని కొత్తగూడెం సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పేర్కొన్నారు. అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. అనంతరం పూర్తి స్థాయి ఫలితాలు రావడంతో సింగరేణి ప్రధాన కార్యాలయం వద్దకు కార్మికులు చేరుకుని సంబరాలు నిర్వహించారు. AITUCకి ఫలితాల పత్రాన్ని అందజేశారు ఎన్నికల అధికారి.

Jyothi

Jyothi

Next Story