Diwali effect: కంటి ఆసుపత్రి కేసులు తగ్గినా.. కాలుష్యం రెట్టింపు అయింది!

Diwali effect: కంటి ఆసుపత్రి కేసులు తగ్గినా.. కాలుష్యం రెట్టింపు అయింది!
x
Highlights

* ఈఏడాది సరోజినిదేవి కంటి ఆస్పత్రికి తగ్గిన కేసులు * దీపావళికి ప్రతి ఏటా వచ్చే కేసులు ఈ ఏడాది తగ్గుదల * ఈ సారి సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో చికిత్స కోసం రెండు కేసులు * ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో 9 కేసులు * * వచ్చిన కేసులు కూడా ఐ వాష్ కోసం వచ్చిన మైనర్ కేసులుగా గుర్తింపు

వెలుగుల పండుగ దీపావళి అంటేనే ఒక పక్క సంబరాలు. మరో పక్క విషాదాలు. ఎంత జాగ్రత్తగా ఉన్న దీపావళి పండుగతో అక్కడక్కడా విషాదాలు చోటు చేసుకోవడం మామూలే. ఎందుకంటే దీపావళి అంటేనే నిప్పుతో ఆట కదా. ముఖ్యంగా కంటికి సంబంధించి దీపావళి పండుగ రోజు ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతాయి. మిరుమిట్లు గొలిపే వెలుగును చూడడం వాళ్ళ.. కాకర పువ్వొత్తుల వంటివి కాల్చే తప్పుడు పొరబాటున ఆ నిప్పు రవ్వలు కంట్లో పడటం.. అలానే పటాసులు కాలుస్తున్నప్పుడు వచ్చే పొగ వలన కంటికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి.

ఇక మరో పెద్ద ప్రమాదం వాతావరణ కాలుష్యం. పటాసులు కాల్చడానికి సరదాగానే ఉంటుంది. కానీ, వాటినుంచి వచ్చే కాలుష్యం విపరీతంగా ఉంటుంది. ఈ సంవత్సరమూ ప్రతీ ఏదులాగే దీపావళి సరదా కాలుష్యం విపరీతంగా వెదజల్లింది. హైదరాబాద్ లో దీపావళి ప్రభావం ఎలా కనిపించిందంటే..

ప్రతీ ఏడాది దీపావళి క్రాకర్స్‌ వల్ల అనేక మంది కంటి సమస్యలతో ఆస్పత్రి పాలయ్యేవారు. పటాసులు కాలుస్తూ కంటికి గాయాలు అవడంతో కంటి ఆస్పత్రులకు పరుగులు పెట్టేవారు. కానీ ఈఏడాది సరోజినీ కంటి ఆస్పత్రికి కేసులు తగ్గాయి. సరోజిని కంటి ఆస్పత్రిలో చికిత్స కోసం రెండు కేసులు, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో తొమ్మిది కేసులు వచ్చాయి. అయితే అవి కూడా ఐ వాష్ చేసుకుని మెడిసిన్ తీసుకుని వెళ్లిపోయిన మైనర్ కేసులని వైద్యులు తెలిపారు. గాయాల సంఖ్య తగ్గినా... కాలుష్యం మాత్రం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దివాళీ ముందు రోజు ఏక్యూఐ ఇండెక్స్‌‌లో గాలి నాణ్యత 57పాయింట్లుగా నమోదు అవగా... పండుగ రోజు ఏక్యూఐ ఇండెక్స్‌లో106పాయింట్స్‌గా గాలి నాణ్యత నమోదు అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories