ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో ఎయిర్ గన్ కలకలం

Khammam: కుక్కలను భయపెట్టేందుకు ఎయిర్ గన్ కొన్న గొర్రెలకాపరి హరీష్

Jyothi
Published on: 27 Aug 2022 12:19 PM IST
Air Gun in Chennuru Kalluru Mandal In Khammam District
X

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో ఎయిర్ గన్ కలకలం

Khammam: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో ఎయిర్ గన్ కలకలం రేపింది. ఒక యువకుడు తుపాకీ పట్టుకుని గ్రామంలో తిరుగుతున్నాడని ప్రచారం జోరుగా సాగడంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని. విచారించారు. వల్లభ నేని హరీష్ అనే యువకుడు తనకు ఉన్న 70 శాల్తీల గొర్రెలను కుక్కల భారీ నుండి కాపాడుకునేందుకు ఖమ్మంలోని అబ్బాస్ టాయ్స్ సెంటర్‌లో కోబ్రా 65 మోడల్ ఎయిర్ గన్ కొనుగోలు చేశాడు. ఈ క్రమం లో తాను కొనుకున్న ఎయిర్ గన్ లో ఒక చిన్న గుండ్రటి రాయిను బుల్లెట్ లా పెట్టి కుక్కకు దగ్గరగా పేల్చాడు. దీంతో కుక్క చనిపోయింది.

ఆ సమయంలో ఆ గన్ ను భుజాన వేసుకుని గ్రామంలో తిరుగుతూ ఇంటికి చేరుకున్నాడు. దీంతో హరీశ్ అనే యువకుడి చేతిలో ప్రమాదకర తుపాకీ ఉందని, టీఆర్ఎస్ నేతను హతమార్చేందుకు కుట్ర అనే పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో గొర్రెల కాపరి కుక్కలను భయపెట్టేందుకు తెచ్చుకున్న ఎయిర్ గన్‌గా తేల్చారు. సోషల్ మీడియాలో హత్యకు కుట్ర అనే పోస్టు ఫేక్‌ అని తేల్చారు.

Jyothi

Jyothi

Next Story