తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అధిష్టానం సీరియస్

Arun Chilukuri
Published on: 16 Dec 2020 8:00 PM IST
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అధిష్టానం సీరియస్
X

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అధిష్టానం సీరియస్ అయ్యింది. హైకమాండ్‌ పిలిస్తే తప్ప అనవసరంగా ఢిల్లీ రావొద్దంటూ లీడర్లకు చురకలేసింది. సోనియా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం కుదరదని టీకాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కార్యాలయం తేల్చిచెప్పింది. అయితే, మరోసారి హైదరాబాద్ రానున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ జిల్లాస్థాయి నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

తెలంగాణ పీసీసీ రేస్ ర‌స‌వ‌త్తరంగా మారింది. ఈ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో మరింత కాకరేపుతోంది. ఇటీవలే కాంగ్రెస్ నేతల అభిప్రయాలను తెలుసుకున్న పార్టీ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ అధిష్టానానికి ఇచ్చిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే తరుణంలో పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు వరుసగా హస్తిన బాట పడుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story