టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపికపై ఏఐసీసీ కీలక ఆదేశాలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌కు అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం మాణికం ఠాగూర్‌ ఆధ్వర్యంలో ఏఐసీసీ బృందం హైదరాబాద్ రానున్న నేపథ్యంలో.. రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయాలని ఆదేశించింది

admin
Published on: 8 Dec 2020 11:35 AM IST
టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపికపై ఏఐసీసీ కీలక ఆదేశాలు
X

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌కు అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం మాణికం ఠాగూర్‌ ఆధ్వర్యంలో ఏఐసీసీ బృందం హైదరాబాద్ రానున్న నేపథ్యంలో.. రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయాలని ఆదేశించింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు గురువారం నుంచి పార్టీలోని అన్ని స్థాయిల నేతల నుంచి అభిప్రాయాల సేకరణ చేయనున్నారు మాణికం ఠాగూర్‌. ఆ తర్వాత మెజారిటీ నేతల అభిప్రాయం ఆధారంగా పీసీసీ అధ్యక్షుడిని నియమించనుంది.

admin

admin

Next Story