ఢిల్లీకి పయనమైన మాణికం ఠాగూర్.. నివేదికను సోనియా గాంధీకి..

X
Highlights
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. అద్యక్షుడి పీఠం నాదంటే నాదని పార్టీలోని సీనియర్లు ధీమా ...
Arun Chilukuri12 Dec 2020 10:25 AM GMT
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. అద్యక్షుడి పీఠం నాదంటే నాదని పార్టీలోని సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్న వేళ.. నాలుగు రోజులపాటు కీలక చర్చలు జరిపిన పార్టీ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ తిరిగి ఢిల్లీ పయనమయ్యారు. నాలుగు రోజులపాటు తెలంగాణలో దాదాపు రెండు వందల మంది ముఖ్య నేతలతో మాణికం ఠాగూర్ చర్చలు జరిపారు. ఇక నేతలతో జరిపిన సంప్రదింపుల నివేదికను సోనియా గాంధీకి అందివ్వనున్నారు. దీంతో పార్టీ సీనియర్లను మరోసారి ఢీల్లికి పిలిచే అవకాశం కనిపిస్తోంది.
Web TitleAICC in-charge Manicka Tagore went to Delhi
Next Story