Congress: టీ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలపై ఏఐసీసీ ఫోకస్‌.. నదీమ్‌ జావెద్‌కు ప్రియాంక గాంధీ ఫోన్‌..

T Congress: సీనియర్‌ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ అయ్యే అవకాశం

R Tripura Malini
Published on: 19 Dec 2022 3:37 PM IST
AICC Focus On Latest Developments In T Congress
X

టీ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలపై ఏఐసీసీ ఫోకస్‌

T Congress: తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై ఏఐసీసీ ఫోకస్‌ పెట్టింది. టీకాంగ్ లో నెలకొన్న పరిస్థితులపై ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావెద్‌కు ప్రియాంక గాంధీ ఫోన్‌ చేసింది. తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలపై ఆరా తీసింది. కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలతో ప్రియాంక గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌లో పరిణామాలపై నదీమ్‌ జావెద్‌ సమాలోచనలు జరుపుతున్నారు. షబ్బీర్‌ అలీతో భేటీ అయిన నదీమ్‌ జావెద్‌ పార్టీలో నెలకొన్న అసమ్మతిపై షబ్బీర్‌ అలీతో మంతనాలు జరుపుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story