Niranjan Reddy: యాసంగిలో వరి వేయకండి

* విత్తనం కోసమైతే వరి వేసుకోవచ్చు -మంత్రి నిరంజన్‌రెడ్డి * ప్రభుత్వం వరి కొనే పరిస్థితుల్లో లేదు -నిరంజన్‌రెడ్డి

Shilpa
Published on: 6 Nov 2021 6:03 PM IST
Agriculture Minister Niranjan Reddy has advised Farmers not to Plant Paddy Crop in Yasangi
X

యాసంగిలో వరి వేయొద్దు అంటున్న మంత్రి నిరంజన్ రెడ్డి(ఫైల్ ఫోటో)

Niranjan Reddy: యాసంగిలో వరి వేయొద్దని, రైతులు వేరే పంటలు వేసుకోవాలని సూచించారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. విత్తనం కోసమైతే వరి వేసుకోవచ్చన్న మంత్రి మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం వరి కొనే పరిస్థితుల్లో లేదని, వచ్చే వేసవిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని కచ్చితంగా చెప్పారు నిరంజన్‌రెడ్డి.

సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. ఏడేళ్లలో అద్భుత ప్రగతి సాధించామన్నారు. వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్‌ పండగలా మార్చారని, రైతుబంధు లాంటి అద్భుత పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారని చెప్పారు నిరంజన్‌రెడ్డి.

Shilpa

Shilpa

Next Story