Gandhi Bhavan: గాంధీభవన్ లో మేడ్చల్ కాంగ్రెస్ నేతల ఆందోళన

Gandhi Bhavan: మీడియా హాల్‌లోకి వచ్చిన హరివర్ధన్‌రెడ్డి వర్గీయులు

Shekhar G
Published on: 16 Oct 2023 4:47 PM IST
Agitation Of Medchal Congress Leaders In Gandhi Bhavan
X

Gandhi Bhavan: గాంధీభవన్ లో మేడ్చల్ కాంగ్రెస్ నేతల ఆందోళన

Gandhi Bhavan: హస్తం పార్టీలో టికెట్ల లొల్లి షురూ అయింది. గాంధీ భవన్ లో మేడ్చల్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మేడ్చల్ నియోజకవర్గ టికెట్ హరివర్ధన్ రెడ్డికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆ జిల్లాకు చెందిన కార్యకర్తలు గాంధీభవన్ ముందు ఎదుట నినాదాలు చేశారు. సర్వేల ఆధారంగా హరివర్ధన్ రెడ్డికే టికెట్ కేటాయించాలని ధర్నా చేపట్టారు. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఇందిరాభవన్ లో ఉన్నారనే సమాచారంతో హరివర్ధన్ రెడ్డి అనుచరులు అక్కడ ఆందోళనకు దిగారు.

Shekhar G

Shekhar G

Next Story