Nalgonda: శివాలయంలో దర్శనానికి అనుమతించలేదని ధర్నా
* అధికారులు జోక్యం చేసుకుని దర్శనానికి అనుమతించాలని డిమాండ్..అధికారులు స్పందించకుంటే కాలువలోకి దూకేస్తామని హెచ్చరిక
శివాలయంలో దర్శనానికి అనుమతించలేదని ధర్నా
Agitation Of Ayyappa Devotees: నల్గొండ జిల్లా హాలియాలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. శివాలయంలోకి వచ్చిన స్వాములపై ఆలయ ధర్మకర్త కేసు పెట్టారని స్వాములు ధర్నాకు దిగారు. అయ్యప్ప, ఆంజనేయ, భవాని, శివమాల ధరించిన భక్తులు దర్శనం కోసం ఆలయానికి వెళ్తే అవమానించారని ఆందోళనకు దిగారు. రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని భక్తులు పట్టుబట్టారు. హాలియా ప్రధాన కూడలి నుంచి శివాలయం దాకా నిరసన ప్రదర్శనతో వచ్చారు. అధికారులు జోక్యం చేసుకోకుంటే కాలువలోకి దూకుతామని హెచ్చరించారు. స్వామివారి దీక్షదారుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ నెలకొంది.
Next Story




