Srinivas Goud: ఏపీ సర్కార్ పై మరోసారి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
Srinivas Goud: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్ ఏం కావాలి?-శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఫైల్ ఇమేజ్)
Srinivas Goud: ఏపీ సర్కార్ పై మరోసారి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం దివిటిపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్.. ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. జలదోపిడికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను దెబ్బతీసే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అక్రమ ప్రాజెక్టులు మొదలు పెట్టిన నాటి నుంచి తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. మూకుమ్మడిగా జలదోపిడిని అడ్డుకొని తీరుతామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
Next Story




