కోర్టుల జోక్యం తగదు.. ఎస్ఈసీ రివ్యూ పిటిషన్

Arun Chilukuri
Published on: 4 Dec 2020 12:09 PM IST
కోర్టుల జోక్యం తగదు.. ఎస్ఈసీ రివ్యూ పిటిషన్
X

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ లంచ్ మోషన్ దాఖలు చేయనుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని, రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే స్వీకరించాలని విజ్ఞప్తి చేయనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో స్వస్తిక్ గుర్తు కాకుండా, ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ ఎన్నికల సంఘం గురువారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టి వేసిన విషయం తెలిసిందే. స్వస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story