Sangareddy: సంగారెడ్డి జిల్లా ఎమ్‌ఐజీ కాలనీలో విషాదం

* భర్త మృతితో ఇద్దరు పిల్లలతో సహా ఆందోల్ పెద్ద చెరువులో దూకిన భార్య

Sandeep Reddy
Updated on: 3 Dec 2021 1:05 PM IST
After her husband died a wife jumped into a large pond with her two children
X

భర్త మృతితో ఇద్దరు పిల్లలతో సహా ఆందోల్ పెద్ద చెరువులో దూకిన భార్య( ఫైల్-ఫోటో)

Sangareddy: సంగారెడ్డి జిల్లా ఎమ్‌ఐజీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవతో భర్తను వదలి పిల్లలతో సహా భార్య వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన భర్త చంద్రకాంతరావు ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతి విషయం తెలుసుకొని ఇద్దరు పిల్లలతో సహా ఆందోల్ పెద్ద చెరువులో దూకి భార్య లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. లావణ్య, కుమారుడు ప్రథమ్‌ మృతదేహాలను వెలికితీశారు. కూతురు సర్పాజ్ఞ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story