Choutuppal: ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తల్లి కూడా బలవన్మరణం

ఇద్దరు కూతుళ్లు మృతి, తప్పించుకున్న మరో చిన్నారి ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం

Sandeep Reddy
Updated on: 8 July 2021 10:46 AM IST
After Hanging Three Children Mother Attempt Suicide in Choutuppal
X

ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తల్లి కూడా బలవన్మరణం

Choutuppal: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. రామ్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌, రాణి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. భర్త మద్యానికి బానిసవ్వడం, కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో రాణి మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో రాత్రి ముగ్గురు పిల్లలకు చీరతో ఉరిబిగించి, తానూ బలవన్మరణానికి పాల్పడింది. చిన్న కుమార్తె మెడనుంచి చీర జారిపోవడంతో ఆమె బయటపడింది. తల్లి ఉమారాణితో పాటు ఇద్దరు కుమార్తెలు హర్షిణి, లక్కీ ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో చౌటుప్పల్‌లో విషాదం ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story