ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : కిషన్‌రెడ్డి

X
Highlights
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ అన్ని వనరులను సమీకరించుకుంటోంది. సర్వశక్తులు...
Arun Chilukuri20 Nov 2020 11:37 AM GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ అన్ని వనరులను సమీకరించుకుంటోంది. సర్వశక్తులు ఒడ్డుతూ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ తో బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ విజ్ఞప్తితో సానుకూలంగా స్పందించిన పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని దుబ్బాక ప్రజలు నిరూపించారని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదీలు కూడా మార్పు కోరుకుంటున్నారని, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
Web TitleAfter dubbaka elections results, People want to change party: Kishan Reddy
Next Story