TS Congress: కాసేపట్లో గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ కీలక భేటీ

TS Congress: ఉమ్మడి జిల్లాలో ఏదైనా స్థానం ఇవ్వాలన్న శివసేనారెడ్డి

Shekhar G
Published on: 25 Oct 2023 12:24 PM IST
After A While The Youth Congress Held An Important Meeting At Gandhi Bhavan
X

TS Congress: కాసేపట్లో గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ కీలక భేటీ

TS Congress: నేడు గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. టికెట్ల కేటాయింపులో యూత్ కాంగ్రెస్‌కి అన్యాయం జరుగుతుందని నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వివిధ జిల్లాల అధ్యక్షులు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముకుమ్ముడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. 3 నుంచి 5 స్థానాలు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ కోరుతున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి వనపర్తి టికెట్ ఆశిస్తున్నారు. వనపర్తి కుదరదని చెప్పడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదైనా స్థానం ఇవ్వాలని శివసేనారెడ్డి కోరుతున్నారు. వీటితో పాటు దేవరకొండ, అంబర్‌పేట స్థానాలను తమకు కేటాయించాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసంత‌ృప్తి ఉన్నా యూత్ కాంగ్రెస్ నాయకులను అధ్య క్షుడు శివసేనారెడ్డి బుజ్జగిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story