Congress: కాసేపట్లో తాజ్ డెక్కన్‌లో టీకాంగ్రెస్ నేతల కీలక భేటీ

Congress: ఈనెల 29న యాత్రలో పాల్గొననున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

Shekhar G
Published on: 27 Oct 2023 6:49 PM IST
After A While The Important Meeting Of Congress Leaders Took Place In Taj Deccan
X

Congress: కాసేపట్లో తాజ్ డెక్కన్‌లో టీకాంగ్రెస్ నేతల కీలక భేటీ 

Congress: ఎన్నికల నేపథ్యంలో వ్యూహరచనపై తెలంగాణ కాంగ్రెస్‌ ఫోకస్ పెంచింది. ప్రచార వేగం పెంచేందుకు కాసేపట్లో హైదరాబాద్‌లోని తాజ్‌ డెక్కన్‌లో కీలక నేతలు సమావేశం కానున్నారు. రేపటి నుంచి రెండో విడత ప్రచారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రచార తీరుతెన్నులపై నేతలు చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్, కర్ణాటక మంత్రి బోస్ రాజు హాజరుకానున్నారు. ఇప్పటికే తొలివిడత బస్సు యాత్ర పూర్తిచేసిన కాంగ్రెస్.. రేపటినుంచి రెండో విడత యాత్రకు సిద్ధమైంది. రేపు తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది. ఈ యాత్రలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొననున్నారు. ఎల్లుండి సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌లలో యాత్ర జరగనుండగా.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొననున్నారు.

Shekhar G

Shekhar G

Next Story