పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

Arun Chilukuri
Published on: 17 Feb 2021 4:39 PM IST
పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య
X

పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణహత్యకు గురయ్యారు. వారిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణి మంథని కోర్టులో పని ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తుండగా రామగిరి మండలం కల్వచర్ల పెట్రోలు బంకు ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి వారిపై దాడికి పాల్పడ్డారు.

కారులో ఉన్న వామన్‌రావు, నాగమణిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. 108 వాహనంలో పెద్దపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వారిద్దరూ మృతిచెందారు. న్యాయవాది దంపతుల హత్య నేపథ్యంలో దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు న్యాయవాది కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story