TS High Court: తెలంగాణ హైకోర్టు లో బిగ్ బాస్ పై పిటిషన్...
TS High Court: ఇదే విషయం పై మహిళ కమిషన్ ఛైర్మన్ కి ఫిర్యాదు చేస్తామన్న పిటిషనర్ అరుణ్ కుమార్.
TS High Court: తెలంగాణ హైకోర్టు లో బిగ్ బాస్ పై పిటిషన్...
TS High Court: బిగ్‌బాస్ షోపేరుతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అడ్వకేట్ అరుణ్ కుమార్. 100 రోజులపాటు కంటెస్టెంట్లను అక్రమంగా నిర్బంధించిన నాగార్జునపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి షోలతో ప్రజలను తప్పుదారి పట్టించడంతోపాటు బిగ్ బాస్ హౌస్ లో అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం వెనుక ఉన్న కుట్రపై విచారణ జరిపి.. బిగ్ బాస్ పోటీలో ఉన్న వారిని విచారించి అసలు నిజాలన్నీ రాబట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇంతటితో ఆగకుండా బిగ్ బాస్ షోలో చోటు చేసుకున్న పలు అంశాలపై మహిళ కమిషన్ ఛైర్మన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని పిటిషనర్ అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు.
Next Story




