Siddipet: చేర్యాలలో కల్తీపాల కలకలం

Siddipet: కొంత మంది చేసిన తప్పుల వల్ల ..తాము నష‌్టపోతున్నామని వాపోయిన పాల ఉత్పత్తిదారులు

Shekhar G
Updated on: 30 Dec 2023 6:00 PM IST
Adulterated Milk In Siddipet
X

Siddipet: చేర్యాల కల్తీ పాల కలకలం

Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాలలో కల్తీపాలు కలకలం రేపింది. ఇటీవల చేర్యాల నుంచి హైదరాబాద్‌ ప్రధాన కేంద్రానికి వెళ్లిన ట్యాంకర్‌లోని పాలు కల్తీవని గుర్తించి... వెనక్కి పంపారు. ఇలా రెండుసార్లు జరగడంతో వివాదానికి దారి తీసింది. దీంతో పాల ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు స్థానిక మేనేజర్‌‌ను నిలదీశారు. పలు గ్రామాలకు చెందిన పాలల్లో ఉప్పు, చక్కెర కలిసిందని మేనేజర్‌ అభ్యంతరం తెలిపారు. కొంత మంది చేసిన తప్పుల వల్ల తాము నష‌్టపోతున్నామని పాల ఉత్పత్తిదారులు వాపోతున్నారు. పాలను పరీక్షించి తీసుకుంటే కల్తీని నిలువరించవచ్చని ఉత్పత్తిదారులు సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story