జంతు కళేబరాలు, చనిపోయిన జంతువులతో నూనె తయారీ

జంతు కళేబరాలు, చనిపోయిన జంతువులతో నూనె తయారీ
x
జంతు కళేబరాలు, చనిపోయిన జంతువులతో నూనె తయారీ
Highlights

వంట కోసం నూనే వాడలంటేనే జనాలు హడలిపోతున్నారు. తాము వాడుతున్న నూనే ఎక్కడి నుంచి వస్తుందో ఏ బ్రాండ్ వెనకాలు ఏ జంతువు ఉందో అన్న ఆందోళన చెందుతున్నారు....

వంట కోసం నూనే వాడలంటేనే జనాలు హడలిపోతున్నారు. తాము వాడుతున్న నూనే ఎక్కడి నుంచి వస్తుందో ఏ బ్రాండ్ వెనకాలు ఏ జంతువు ఉందో అన్న ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో కల్తీనూనేను తయారు చేస్తున్న బండారం బయటపడడంతో నగర ప్రజలు నూనే చూస్తేనే భయంతో వణికిపోతున్నారు.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లో కల్తీ నూనే తయారీ బండారం బయటపడింది. హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గుట్టు చప్పుడు కాకుండా జంతు కళేబరాలతో కల్తీ నూనే, పశువుల దాణా తయారు చేస్తున్నారు. దీంతో స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందిచారు.

ఫుడ్ ఇన్ఫెక్షన్ ఆఫీసర్లు, పోలీసులు, స్థానికుల సహాయంతో హరి ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో తనిఖీలు చేశారు దీంతో అక్కడ విస్తుపోయే నిజం బయటపడింది. భారీ ఎత్తున జంతు కళేబరాలు, చనిపోయిన జంతువులతో నూనె తయారు చేయడం చూసి షాక్ అయ్యారు హరి ఫీడ్స్ ను సీజ్ చేశారు పోలీసులు.

నిత్యం అవసరంగా ఉండే వంటనూనే ను కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఇంతకుముందు ఇదే జిల్లాలో కల్తీ నూనే బండారం బయటపడింది. కల్తీగాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories