అసలే కరోనా కాలం..రానున్నది శీతలం..ఆదిలాబాద్ ప్రజల్లో గుబులు!

అసలే కరోనా కాలం..రానున్నది శీతలం..ఆదిలాబాద్ ప్రజల్లో గుబులు!
x
Highlights

కరోనా మామూలుగానే భయపెడుతోంది. ఇక దానికి ఇష్టమైన శీతాకాలం వస్తే ఎంత రెచ్చిపోతుందో అని ఆదిలాబాద్ ప్రజలు భయంతో ఉన్నారు.

భూమిపై ఎక్కువ ప్రాంతంలో వాతావరణం మారుతోంది. చలికాలం వచ్చేస్తోంది ఇదే సీజన్‌లో జలుబు, జ్వరం లాంటివి రావడం సర్వ సాధారణం. కానీ, ఈసారీ చలికాలం అనేక మందిలో ఆందోళన పెంచుతోంది. చలి వాతావరణంలో కరోనా వైరస్ మరింత ఉదృతరూపం దాల్చే ప్రమాదం ఉందని వేగంగా వ్యాపించవచ్చని ప్రజలు భయపడుతున్నారు. శీతాకాలంలో కరోనావైరస్ 'సెకెండ్ వేవ్' ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

అసలే కరోనా కాలం. ఆపై చలికాలం. ఇదే ఇప్పుడు గుబులు పుట్టిస్తోంది. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వైరస్‌లు ఎక్కువసేపు జీవించి ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలం ప్రారంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను కరోనా వణికిస్తోంది. ప్రతి ఏటా జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గత చలికాలం సీజన్‌లో ఆదిలాబాద్ జిల్లా బీమ్ పూర్ మండలం అర్లి (టి)లో అత్యల్పంగా 2.0డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 10 కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే మండలాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కరోనా విజృంబిస్తోందని వైద్యులు చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెబుతున్నారు.

ముందు పట్టణ పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కరోనా మహమ్మారి ఇప్పుడు పల్లెల్లో కూడా కలవర పెడుతోంది. ఇన్ని రోజులు పట్టణాల కంటే గ్రామాలే సురక్షితం అనే భావన ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలు ప్రమాదకరంగా మారాయి. వైరస్‌ విజృంభనకు అర్లి టీ గ్రామంలో అనువైన పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలు హడలిపోతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే ప్రారంభమైన చలితో ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వైరస్‌ వ్యాప్తి చెందితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories