Adilabad: ఆదిలాబాద్‌లో కొనసాగుతోన్న వైద్య విద్యార్థుల ఆందోళన

Adilabad: ఆదిలాబాద్‌లో వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రి జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్‌ నిరసనకు దిగారు.

Shekhar G
Published on: 14 Dec 2023 6:47 PM IST
Adilabad Ongoing Agitation By Medical Students
X

Adilabad: ఆదిలాబాద్‌లో కొనసాగుతోన్న వైద్య విద్యార్థుల ఆందోళన

Adilabad: ఆదిలాబాద్‌లో వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రి జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్‌ నిరసనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యార్థులపై దాడి జరిగినా రిమ్స్ డైరెక్టర్ ఇప్పటివరకూ స్పందించకపోవడంపై మండిపడుతున్నారు.

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి ఘర్షణకు కారకులైన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా కలెక్టరేట్ ముందు మెడికల్ విద్యార్థులు నిరసన చేపట్టారు. రిమ్స్ ఆస్పత్రిలోని వార్డుల్లో ఎలుకలు తిరుగుతున్నాయని.. సరైన వసతులు లేవని డైరెక్టర్‌ను ప్రశ్నించినందుకు దాడి చేశారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. డైరెక్టర్‌కు బంధువైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి, మరికొందరు బయటి వ్యక్తులను తీసుకువచ్చి తమపై అమానుషంగా దాడి చేయించారని చెబుతున్నారు. తమపై దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని విధులనుండి తొలగించాలని, రిమ్స్ డైరెక్టర్‌ను మార్చాలని మెడికోలు డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story