పంటను ట్రాక్టర్ తో తొక్కిస్తున్న రైతులు

పంటను ట్రాక్టర్ తో తొక్కిస్తున్న రైతులు
x
Highlights

ఆరు గాలం కష్టపడి పత్తి సాగు చేసిన రైతులు తెల్లబోతున్నారు. మొన్నటి వరకు పండించిన పంట చేతికి అంది వచ్చే సమయంలో పురుగు పట్టి పీడించిందంటూ పంటకు నిప్పు...

ఆరు గాలం కష్టపడి పత్తి సాగు చేసిన రైతులు తెల్లబోతున్నారు. మొన్నటి వరకు పండించిన పంట చేతికి అంది వచ్చే సమయంలో పురుగు పట్టి పీడించిందంటూ పంటకు నిప్పు పెట్టుకున్న పత్తి రైతులు తాజాగా కాత కాయకపోవడంతో పంటను ట్రాక్టర్ తో తొక్కిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను తమ చేతుల మీదుగానే పీకేయాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సారి పత్తి పంటను సాగు చేసుకోవాలని ప్రోత్సహించడంతో రైతులు పంట విస్తీర్ణం భారీగా పెంచారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పత్తి పంట సాగు చేశారు. అప్పు చేసి పెట్టుబడులుపెడితే తమ ఆశలన్ని ఆవిరయి పోయాయని బరువెక్కిన గుండెతో రైతులు దిగాలు చెందుతున్నారు. మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో పంట సాగుచేస్తే భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వామే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories