మనో విజ్ఞాన యాత్ర పొస్టర్‌ను లాంచ్ చేసిన ఆదిలాబాద్ అడిషనల్‌ కలెక్టర్‌

Mano Vignana Yatra 2022: స్వస్, లైన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో మనో విజ్ఞాన యాత్ర పొస్టర్ ను గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆవిష్కరించారు.

Arun Chilukuri
Published on: 17 Nov 2022 11:00 AM IST
Adilabad Additional Collector Rizwan Basha Unveiled the poster of Mano Vignana Yatra 2022 by SUPAR Foundation
X

మనో విజ్ఞాన యాత్ర పొస్టర్‌ను లాంచ్ చేసిన ఆదిలాబాద్ అడిషనల్‌ కలెక్టర్‌

Mano Vignana Yatra 2022: స్వస్, లైన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో మనో విజ్ఞాన యాత్ర పొస్టర్ ను గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ "మానసిక, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు మన జిల్లాకే విచ్చేస్తున్న ఈ మనో విజ్ఞాన యాత్ర సెషన్లను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ వాసులకు విజ్ఞప్తి చేశారు.

జీవితంలో ఎదురయ్యే మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో ఉన్నత శిఖరాలను అంధిరోహించడమే లక్ష్యంగా ప్రారంభమవుతోంది మిషన్ మనో విజ్ఞాన యాత్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో 30 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, ఎడిట్ పాయింట్ అధినేత రమేశ్ ఇప్పలపల్లి, ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండ వారి రంగాలకు సంబంధించిన విలువైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్‌నర్‌గా hmtv వ్యవహరిస్తోంది.

ఎలాంటి ప్రవేశ రుసుం లేని ఈ ఉచిత సెషన్లలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

రిజిస్ట్రేషన్ లింక్: www.manovignanayatra.com

Arun Chilukuri

Arun Chilukuri

Next Story