Adibatla Kidnap Case: యువతి కిడ్నాప్‌ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Adibatla Kidnap Case: నవీన్‌రెడ్డిపై గతంలోనూ 3 కేసులు

Jyothi
Published on: 13 Dec 2022 5:05 PM IST
Adibatla Kidnap Case Remand Report
X

Adibatla Kidnap Case: యువతి కిడ్నాప్‌ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Adibatla Kidnap Case: నవీన్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్‌రెడ్డిపై గతంలోనూ 3 కేసులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో ఇవాళ మరొకరు అరెస్ట్ అయ్యారు. A-1 నిందితుడిగా నవీన్‌రెడ్డి, A-6 నిందితుడు చందును పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్‌ ఫోన్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. గతేడాది బొంగుళూలోని స్పోర్ట్స్ అకాడమీలో నవీన్‌రెడ్డికి వైశాలి పరిచయం అయ్యింది. యువతి నెంబర్‌ తీసుకొని నవీన్‌రెడ్డి ఫోన్‌లు, మెస్సేజ్‌లు పంపినట్లు గుర్తించారు. ఇక పరిచయాన్ని అడ్డుపెట్టుకొని యువతితో నవీన్‌రెడ్డి ఫోటోలు దిగాడు. ఈ మధ్యలో నవీన్‌రెడ్డి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్న వైశాలి చెప్పడంతో.. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశాడు నవీన్‌రెడ్డి. కిడ్నాప్‌లో పాల్గొన్న వారి ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ చేయించిన నవీన్‌రెడ్డి.. తన సెల్‌ఫోన్‌ను మాత్రం ఆన్‌లో పెట్టినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టు‌లో పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story