Actress Hema: 'మా' అసోసియేషన్‌ నుంచి నటి హేమ సస్పెన్షన్‌

హేమను సస్పెండ్‌ చేసిన 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 Jun 2024 7:57 PM IST
Actress Hema suspended from Maa association
X

Actress Hema: 'మా' అసోసియేషన్‌ నుంచి నటి హేమ సస్పెన్షన్‌

నటి హేమను సస్పెండ్‌ చేసింది 'మా' అసోసియేషన్. బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హేమను సస్పెండ్‌ చేశారు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు. హేమ వ్యవహారంపై అత్యవసరంగా భేటీ అయిన 'మా'.. నిన్న షోకాజ్‌ నోటీసు పంపింది. అయితే.. షోకాజ్‌ నోటీసుకు హేమ నుంచి సమాధానం రాకపోవడంతో హేమను సస్పెండ్‌ చేస్తూ 'మా' కమిటీ నిర్ణయం తీసుకుంది. హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ‘మా’ సభ్యులకు తెలిపారు. ఇక రేవ్‌ పార్టీ కేసులోహేమను కోర్టులో హాజరుపరచగా, జూన్‌ 14 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story