Free Ambulance to Shift Covid19 dead Bodies: హైదరబాదీ సామాజిక కార్యకర్తల గొప్ప మనసు.. కరోనా డెడ్ బాడీల తరలింపునకు ఉచిత అంబులెన్స్..

Free Ambulance to Shift Covid19 dead Bodies:  హైదరబాదీ సామాజిక కార్యకర్తల గొప్ప మనసు.. కరోనా డెడ్ బాడీల తరలింపునకు ఉచిత అంబులెన్స్..
x
Representational Image
Highlights

Free Ambulance to Shift Covid19 dead Bodies: కరోనా వైరస్ తో ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ మరణించిన బాధితులను ప్రభుత్వమే అంబులెన్స్‌లో డెడ్ బాడీని తరలించి ఖననం చేస్తోంది.

Free Ambulance to Shift Covid19 dead Bodies: కరోనా వైరస్ తో ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ మరణించిన బాధితులను ప్రభుత్వమే అంబులెన్స్‌లో డెడ్ బాడీని తరలించి ఖననం చేస్తోంది. కానీ ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎవరైనా కరోనా మహమ్మారి సోకి చనిపోయిన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రయివేటు అంబులెన్సులు సమారుగా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి వసూలు చేస్తున్నాయి. అంతే కాదు కరోనా లక్షనా లక్షణాలు ఉన్న వారిని ఆస్పత్రులకు తరలించడానికి కూడా వారు అధికమొత్తంలో వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని గమనించి, వారి బాధలను తెలుసుకున్న పది మంది సామాజిక కార్యకర్తలు చొరవ తీసుకొని ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఆ పది మంది సెకండ్ హ్యాండ్ మారుతీ ఓమ్నీని ఆన్‌లైన్లో రూ.70 వేలకు కొనుగోలు చేసి దాన్ని అంబులెన్స్‌గా రూపుదిద్దారు. అంతే కాదు ఆ వాహనంలో మృతదేహాలను ఉంచే ఏర్పాట్లతోపాటు.. డ్రైవర్‌కు ఇన్ఫెక్షన్ సోకే ముప్పు లేకుండా ఓ చాంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదనంగా ఇవ్వన్నీ అమర్చేందుకు అదనంగా మరో రూ.20 వేలు ఖర్చుపెట్టారు. అంతే కాదు ఈ వాహనాన్ని నడిపించడానికి ఇద్దరు డ్రైవర్లు ఒక అటెండర్‌ను నియమించనున్నారు. వారికి జీతం ఇవ్వడంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కడతామని ఈ టీం సభ్యుడు సురేంద్ర అప్లాంచివర్ తెలిపారు. ఈ అంబులెన్స్ వల్ల కరోనాత చనిపోయిన వారి కుటుంబ సభ్యులపై తక్కువ భారం పడుతుందన్నారు. ఈ అంబులెన్స్ ద్వారా కరోనా బాధితుల డెడ్ బాడీలను 'సర్వ్ ది నీడీ' పేరిట సైబరాబాద్ పోలీసు కమిషరేట్ పరిధిలో ఉచితంగా తరలించనున్నారు. అంతే కాదు ఈ వాహనానికి కాస్త డిమాండ్ వస్తే దాన్ని బట్టి సేవలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని సామాజిక కార్యకర్త తెలిపారు.

అసలు ఈ పది మందిచి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే విషయాన్ని గమనిస్తే వారి సహచరుడు ఒకరి స్నేహితుడి భార్య ప్రయివేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకెళ్లేందుకు వారికి అంబులెన్స్ దొరకడం చాలా కష్టమైంది. అదే విధంగా మరో స్నేహితుడి భార్యకు రాత్రి 3 గంటల సమయంలో కరోనా లక్షణాలు ఉండడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించడం కోసం ఎన్ని అంబులెన్స్‌లకు, హాస్పిటళ్లకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. ఇలాంటి బాధలు ఎందరో పడుతున్నారని గ్రహించిన వీరంతా కలిసి (సర్వ్ దీ నీడీ' పేరిట ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories