Raj Tharun: సినీనటుడు రాజ్‌తరుణ్‌ కేసులో పోలీసుల చర్యలు

Raj Tharun: రాజ్‌తరుణ్‌తో పాటు మాల్వి, మయాంక్‌పై కేసు నమోదు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 July 2024 2:45 PM IST
Actions of the police in the case of film actor Raj Tarun
X

Raj Tharun: సినీనటుడు రాజ్‌తరుణ్‌ కేసులో పోలీసుల చర్యలు

Raj Tharun: సినీ నటుడు రాజ్‌తరుణ్, లావణ్య కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాజ్‌తరుణ్‌తో పాటు మాల్వీ మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగ్ పోలీసులు. ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. లావణ్య ఇచ్చిన ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. 2008 నుంచి రాజ్‌తరుణ్ తనకు పరిచయమయ్యాడని, 2010లో తనకు రాజ్‌తరుణ్ ప్రపోజ్ చేసి, 2014లో పెళ్లిచేసుకున్నట్లు లేఖలో తెలిపింది. రాజ్‌తరుణ్‌కు ఉన్న ఆర్థిక ఇబ్బందులను తన కుటుంబం భరించినట్లు తెలిపింది. మాల్వి, రాజ్‌తరుణ్ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని, యూఎస్ నుంచి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపింది. రాజ్‌తరుణ్, మాల్వీ కలిసి తనను చంపేస్తామంటూ బెదిరించారని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story