Accident: కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురి మృతి!

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

K V D Varma
Published on: 15 Feb 2021 9:23 AM IST
Accident in Jagityala District
X

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)

జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కట్లకుంట దగ్గర ఎస్సారెస్పీ కెనాల్‌ లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులు అడ్వకేట్ అమరేందర్‌, భార్య శిరీష, కూతురు శ్రేయగా గుర్తించారు. కొడుకు జయంత్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కెనాల్‌ నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతులంతా కోరుట్ల మండలం జోగన్‌పల్లికి చెందినవారిగా గుర్తించారు. వెంకటేశ్వరస్వామి జాతరకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

K V D Varma

K V D Varma

Next Story