ఏసీబీ వలలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ.. హైదరాబాద్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవీందర్‌ గుప్తా

Telangana University: తెలంగాణ వర్సిటీ వీసీ ఏసీబీ వలకు చిక్కారు.

Arun Chilukuri
Updated on: 17 Jun 2023 1:07 PM IST
ACB Catches Telangana University VC Ravinder Gupta While Accepting Bribe
X

ఏసీబీ వలలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ.. హైదరాబాద్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవీందర్‌ గుప్తా

Telangana University: తెలంగాణ వర్సిటీ వీసీ ఏసీబీ వలకు చిక్కారు. హైదరాబాద్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు రవీందర్‌ గుప్తా. వర్సిటీలో నియామకాలు, నిధులపై కొంతకాలంగా.. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు వీసీ రవీందర్ గుప్తా. ఈ క్రమంలో బాధితుడు శంకర్‌ ఏసీబీని ఆశ్రయించగా.. ఏసీబీ వల పన్నింది. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లి బాధితుడు డబ్బు ఇవ్వబోయాడు. ఆ టైంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రవీందర్‌ గుప్తా. ప్రస్తుతం వీసీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story