ఈఎస్ఐ డైరెక్టర్‌ దేవికారాణి అరెస్ట్

ఈఎస్ఐ డైరెక్టర్‌ దేవికారాణి అరెస్ట్
x
Highlights

10 కోట్ల రూపాయిలు జరిగిన ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న IMS డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల పాటు దేవికా రాణి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈఎస్ఐ స్కాంలో తొలి వికెట్ పడింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు స్కాంలో దేవికారాణిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవికారాణిని షేక్‌పేటలోని ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు తరలించారు. 10 కోట్ల రూపాయిలు జరిగిన ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న IMS డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల పాటు దేవికా రాణి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికా రాణి నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా వరంగల్ తో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణంలో 17 మంది ఉద్యోగులతో పాటు నలుగురు ప్రయివేటు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. అవసరం లేకపోయినా ..నకిలీ బిల్లులతో మందులు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. 2018 మేలో కొనుగోలు చేసిన పలు మందులను డిస్పెన్సరీలకు పంపనట్టు గుర్తించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories