Hyderabad: రూ.30 వేల కోసం.. అన్నను ఆటోతో ఢీకొట్టి హతమార్చిన తమ్ముడు

Abdullapurmet Mandal Of Hyderabad Is Worst In Mazidpur
x

Hyderabad: రూ.30 వేల కోసం.. అన్నను ఆటోతో ఢీకొట్టి హతమార్చిన తమ్ముడు

Highlights

Hyderabad: గ్రామంలో ఉద్రిక్త వాతావరణం.. పోలీసు పికెటింగ్

Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మాజిద్‌‌పూర్ గ్రామంలో దారుణం జరిగింది. వరుసకు అన్నదమ్ములయ్యే ఇద్దరు 30 వేల రూపాయల కోసం వైన్స్ షాపు వద్దే ఘర్షణ పడ్డారు. అక్కడి నుంచి బైకుపై వెళుతున్న సోదరుడు రాంచందర్‌ను మద్యం మత్తులో ఆటోతో ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు తమ్ముడు శ్రీశైలం... అయితే ఘటనా స్థలంలోనే అన్న రాంచందర్ మరణించాడు.. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీశైలం ఇంటిపై మృతుడు రాంచందర్ కుటుంబసభ్యులు, బంధువులు దాడి చేశారు. ఇంటి అద్దాలు, ఫర్నిచర్, ఓ టూ వీలర్, మరో ట్రాన్స్‌పోర్టు వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories