అమెరికాలో జరిగిన ప్రమాదంలో యాదాద్రి జిల్లా యువతి మృతి

ఫ్లోరిడా నగరంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 May 2024 7:41 PM IST
A Young Woman Of Yadadri District Died In An Accident In America
X

అమెరికాలో జరిగిన ప్రమాదంలో యాదాద్రి జిల్లా యువతి మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యాదాద్రి జిల్లా యాదగిరి పల్లికి చెందిన యువతి ఫ్లోరిడా నగరంలో మృతి చెందింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు అతివేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో యువతి సౌమ్య అక్కడికక్కడే మృతిచెందగా... సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు అక్కడి పోలీసులు తెలియజేశారు. యువతి మృతిచెందిన వార్త తెలియడంతో యాదగిరిపల్లిలో విషాధఛాయలు అలముకున్నాయి. అత్యున్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న కుమార్తె హఠాత్తుగా మృతిచెందడంతో సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story