Crime News: ప్రాణాంతకమైన యువతుల ప్రేమ

A Young Woman Murdered Her Friend
x

Crime News: ప్రాణాంతకమైన యువతుల ప్రేమ

Highlights

Crime News: స్నేహితురాలిని హత్య చేసిన యువతి

Crime News: ఇద్దరు యువతుల స్నేహం ప్రేమగా మారి సహజీవనం వరకు వరకు వెళ్లి... చివరకు హత్యకు దారితీసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న కోపంతో ఒక యువతి తన స్నేహితురాలిని హత్య చేసిన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన నల్లారి అంజలి నెన్నెల మండలం మన్నెగూడెంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుండేది. అదే గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. అంజలి కళ్లద్దాల దుకాణంలో పని చేస్తుండగా... మహేశ్వరి ఓ పెట్రోల్ బంకులో పని చేసి ఇటీవల మానేసింది. కొంతకాలంగా మహేశ్వరి, అంజలి సహజీవనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

మంచిర్యాలలో శ్రీనివాస్‌తో మహేశ్వరికి పరిచయం ఏర్పడింది. రెండు నెలలుగా అంజలి శ్రీనివాస్‌‌తో సన్నిహితంగా ఉంటూ మహేశ్వరిని దూరం పెడుతూ వచ్చింది. బుధవారం రాత్రి విధులు ముగించుకుని అంజలి గదికి వెళ్లింది. రాత్రి 10 గంటలకు మామిడిగట్టుకు వెళ్దామంటూ... మహేశ్వరి ద్విచక్ర వాహనంపై వెంటబెట్టుకుని బయలుదేరింది. రాత్రి 11.30 లకు మహేశ్వరి శ్రీనివాస్‌కు ఫోన్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని మహేశ్వరి తెలపడంతో శ్రీనివాస్ కారులో గుడిపల్లి శివారులోని ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అంజలిని, స్వల్పంగా గాయపడ్డ మహేశ్వరిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అంజలి చనిపోయింది. అంజలి మెడపై లోతైన గాయం ఉండటంతో మహేశ్వరి ఆమెను హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్వరి పొట్ట, మెడపై చిన్నపాటి కత్తి గాట్లు ఉండటంతో ఆత్మహత్యాయత్నం పేరిట నమ్మించేందుకు యత్నించిందని అనుమానిస్తున్నారు.

అంజలిని గొంతుకోసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహేశ్వరి అంజలిని హత్య చేసిందా ? ఇంకా ఎవరైనా ఉన్నారా? శ్రీను అనే వ్యక్తి ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీ‌ను అనే వ్యక్తి హ‌స్తం ఉందా . ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న పాత్ర ఏమిటి అనే విష‌యంలో ఆరా తీస్తున్నారు. కాల్ రికార్డులు పరిశీలిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories