Kamareddy: బాత్‌రూమే ఆ యువతికి ఇల్లు..

A Young Woman is Living in the Bathroom in Kamareddy District
x

Kamareddy: బాత్‌రూమే ఆ యువతికి ఇల్లు..

Highlights

Kamareddy: విధి ఆడుతున్న నాటకంలో తోలు బొమ్మగా మారింది ఓ యువతి.

Kamareddy: విధి ఆడుతున్న నాటకంలో తోలు బొమ్మగా మారింది ఓ యువతి. పుట్టినప్పటి నుండి వెంటాడుతున్న కష్టాలు ఓ వైపు నా అనుకున్నవారు ఒక్కోక్కరుగా దూరం అవుతూండటం మరోవైపు ఈ యువతి జీవితాన్ని చిన్నబిన్నం చేశాయి. కనీసం ఉండేందుకు నిలువ నీడ లేకపోవడతో ప్రభుత్వం కట్టించిన టాయిలెటే ఆమెకు దిక్కైయింది.

కామారెడ్డి జిల్లా దోమ‌కొండ మండ‌లం ఫ‌రీద్‌పేటకు చెందిన ఎల్ల‌య్య‌-ఎల్ల‌వ్వ దంప‌తుల ఒక్కగానొక్క కుమార్తె సోని తన జీవితంలో పడరాని కష్టాలు పడుతోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. తల్లి చనిపోయిన కొద్ది రోజులకే ఇళ్లు కూడా కూలిపోవడంతో ఈ ప్రభుత్వ టాయిలెట్‌లోనే గడుపుతోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆమె ఉంటున్న మరుగుదొడ్డి చుట్టూ పాములు, తేళ్లు తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ విషపురుగు కాటేస్తుందోనని ఆమె ఆందోళన చెందుతోంది. స్వచ్చంద సంస్థలు, మానవతావాదులు ముందుకొచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories