Hyderabad: యువతిని, ఆమె తల్లిని కత్తితో పొడిచిన యువకుడు

Hyderabad: ప్రేమ వ్యవహారమే గొడవకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు

R Tripura Malini
Published on: 13 Dec 2022 4:06 PM IST
A Young Man Stabbed A Young Woman And Her Mother
X

Hyderabad: యువతిని, ఆమె తల్లిని కత్తితో పొడిచిన యువకుడు

Hyderabad: మియాపూర్‌లో దారుణం జరిగింది. యువతిని, ఆమె తల్లిని కత్తితో పొడిచాడు ఓ యువకుడు. ఆదిత్య నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్ కిమ్స్‌కు బాధితులను తరలించారు. యువకుడు రేపల్లెకు చెందిన బబ్లూ అలియాస్ సందీప్‌గా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే గొడవకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి అనంతరం సందీప్ గొంతు కోసుకుని ఆత్మహత్యయాత్నానికి యత్నించాడు. సందీప్‌ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేపల్లెకు చెందిన సందీప్ కుమార్ అలియాస్ బబ్లూ, బాధితురాలికి మధ్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. బాధితురాలు సందీప్ ఫోన్ బ్లాక్ చేయడంతో హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటికి వచ్చి ఆమెతో సందీప్ గొడవకు దిగాడు. అనంతరం యువతితో పాటు తల్లిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు సందీప్ గొంతు కోసుకున్నాడు.

R Tripura Malini

R Tripura Malini

Next Story