Hyderabad: తొమ్మిదేళ్ల కిత్రం తనకు సాయం చేసిన ఓ పోలీస్‌ అధికారికి కృతజ్ఞతలు తెలిపిన మహిళ

A Woman Thanked a Police Officer
x

Hyderabad: తొమ్మిదేళ్ల కిత్రం తనకు సాయం చేసిన ఓ పోలీస్‌ అధికారికి కృతజ్ఞతలు తెలిపిన మహిళ

Highlights

Hyderabad: హైదరాబాద్‌లో గుండెలను హత్తుకునే సన్నివేశం

Hyderabad: సాయం చేస్తే మరిచిపోయే ఈ రోజుల్లో.. తొమ్మిదేళ్ల కిత్రం తనకు సాయం చేసిన ఓ పోలీస్‌ అధికారికి కృతజ్ఞతలు తెలిపింది ఓ మహిళ.. బస్సులో వెళ్తుంటే పోలీస్‌ అధికారిని చూసి గుర్తుపట్టి..పరుగు పరుగున వచ్చి తన గుండెల నిండా నింపుకున్న అభిమానాన్ని చాటుకుంది. ..సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బందోబస్త్‌ విధుల్లో ఉన్న మహంకాళి ఏసీపీ రవీందర్‌ను కలవడానికి రావడంతో అందరు ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్‌ 2014 సంవత్సరంలో టప్పాచబుత్ర సీఐగా ఉన్నప్పుడు రోడ్డుపై అనారోగ్యంతో ఉన్న కవిత అనే మహిళకు తన సొంత డబ్బుతో ఆస్పత్రిలో చేర్చించి ఆపరేషన్‌ చేయించారు. బస్సులో వెళ్తున్న ఆమె ఏసీపీని గుర్తు పట్టి బస్సు మధ్యలో దిగి వచ్చి కలిసి సంతోషంలో మునిగిపోయింది. అన్న నీ కోసం వెండి రాఖీ కొన్న వచ్చి కడుతానని ఆ మహిళ ఆనందం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories