భర్త ఉద్యోగం తనకు కావాలని.. కట్టుకున్న వాన్నే చంపేసిన భార్య..!

A Woman Killed Her Husband For His Job In Bhadradri Kothagudem
x

భర్త ఉద్యోగం తనకు కావాలని.. కట్టుకున్న వాన్నే చంపేసిన భార్య..!

Highlights

Bhadradri Kothagudem: తాగుడుకు బానిసైన భర్త వేధిస్తున్నాడని భర్తను ఓ మహిళ హతమార్చింది.

Bhadradri Kothagudem: తాగుడుకు బానిసైన భర్త వేధిస్తున్నాడని భర్తను ఓ మహిళ హతమార్చింది. జారి పడ్డాడని కథ అల్లింది. చివరకు పోలీసు విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చుంచుపల్లి గాంధీ కాలనీకి చెందిన కొమ్మరబోయిన శ్రీనివాస్ కొత్తగూడెం కలెక్టరేట్‌లో అటెండర్‌గా పని చేస్తున్నాడు. గత నెల 29న అర్ధరాత్రి ఆయన వంటింట్లో జారి పడ్డాడని.. తీవ్రంగా గాయపడ్డాడని భార్య సీతామహాలక్ష్మీ మరుసటి రోజు ఉదయం కొత్తగూడెం ఆసుపత్రిలో చేర్పించింది.

కొద్దిగంటల్లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోయాడు. తండ్రి మృతిపై అనుమానంతో కుమారుడు సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు సీతామహాలక్ష్మీ కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. తాగి వచ్చిన భర్త తలపై కొట్టి వంట గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టినట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. వేధింపులు తప్పడంతో పాటు కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం తనకు దక్కుతుందని హత్య చేసినట్లు అంగీకరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories