Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు

Phone Tapping Case: SIB చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు!

Shashank Gullapelli
Published on: 25 April 2024 10:48 AM IST
A Turning Point In The Phone Tapping Case
X

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు

Phone Tapping Case: తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభాకర్‌రావు విదేశాలకు పారిపోయారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభాకర్‌రావు ఆచూకీపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్‌రావు అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఆరు నెలల విజిటింగ్ వీసా మీద అమెరికా వెళ్లినట్లు గుర్తించారు. ఇప్పటికే రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో నాలుగు నెలల తర్వాత ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో సాక్ష్యాలను బట్టి విచారణను వేగవంతం చేశారు పోలీసులు. అటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story