Peddapalli: పెద్దపల్లి జిల్లా కాటేపల్లి లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

Peddapalli: ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 Jun 2024 5:30 PM IST
A six-year-old girl was raped and killed in Katnapalli, Peddapalli district
X

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాటేపల్లి లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

Peddapalli: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. పశువాంఛతో తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ అమానుష ఘటనను రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య ఘటన దురదృష్టకరమని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క అన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమాచారం అందగానే పోలీసులు స్పందించి గంట వ్యవధిలోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని అయితే అప్పటికే చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story