Nizamabad: జిల్లాలో కలకలం రేపుతున్న పిల్లల కిడ్నాప్.. స్కూల్ మేనేజ్మెంట్లను అలర్ట్ చేస్తున్న పోలీసులు

Nizamabad: జిల్లాలో కలకలం రేపుతున్న పిల్లల కిడ్నాప్..స్కూల్ మేనేజ్మెంట్లను అలర్ట్ చేస్తున్న పోలీసులు
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో వరుసగా జరుగుతున్న చిన్నారుల కిడ్నాప్‌ల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో వరుసగా జరుగుతున్న చిన్నారుల కిడ్నాప్‌ల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో నలుగురు పిల్లలను ఎత్తుకెళ్లిన ముఠా చిన్నారులు దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. రెండు ఘటనల్లో నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకోగా, వీరి వెనుక ఓ ముఠా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్‌లను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. కిడ్నాప్‌కు గురైన వారంతా ఏడేండ్ల వయసులోపు పిల్లలు కావడం చర్చనీయాంశంగా మారింది. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే పలువురు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్టు సమాచారం.
నిజామాబాద్ నగరంలోని మాలపల్లికి చెందిన మహ్మద్ మీహాజ్ అనే బాలుడిని జనవరి 30న ఓ ముఠా కిడ్నాప్ చేసింది. బాలుడిని హైదరాబాద్‌లో ని ఓముఠాకు 3లక్షల రూపాయలకు విక్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 4 రోజుల్లో బాలుడిని రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన ముఠాను చాకచక్యంగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బడాభీంగల్‌కు చెందిన విద్యుత్ శాఖ లైన్‌మన్ గంగారాం ఈ నెల 4న భార్య , అయిదేళ్ల కుమారుడితో కలిసి మరో గ్రామానికి వెళ్లేందుకు ఆర్మూర్ బస్టాండ్‌లో బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్న టైంలో వారి ఐదేండ్ల బాలుడు సిద్ధార్థ తేజ కిడ్నాపయ్యాడు. సత్తెమ్మ అనే మహిళ వరంగల్ వెళ్లే బస్సులో బాబును తీసుకెళ్లింది. చాక్లెట్ తిన్న బాలుడు నిద్రమత్తులోకి వెళ్లాడు. నిద్రలేచిన తరువాత పెద్దగా ఏడవడంతో అనుమానించిన ప్యాసింజర్లు సత్తెమ్మను ప్రశ్నించారు. ఆమె చెప్పిన సమాధానాలు అనుమానంగా ఉండడంతో కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్‌కు బస్సును తీసుకెళ్లారు. నిందితురాలు పోలీసుల అదుపులో ఉండగా, కిడ్నాప్‌కు గురైన బాలుడు కొన్ని గంటల్లోనే పేరెంట్స్ వద్దకు చేరుకున్నాడు.
ఈ నెల 1న ఆర్మూర్ పట్టణంలో శేక్ మహేరా అనే ఏండేండ్ల మూగ అమ్మాయి కిడ్నాప్‌కు గురైంది. కొన్ని గంటల వ్యవధిలో దొరికింది. మూగ బాలిక కావడంతో ఏం జరిగిందో చెప్పలేకపోతోంది. నిజామాబాద్ జిల్లాలో వరుస కిడ్నాప్‌లు జరుగుతున్న దృష్ట్యా అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. స్కూల్స్ యాజమాన్యాలను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. వాచ్మన్లను నియమించుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



