Hyderabad News: హైదరాబాద్‌లో ఓ స్థిరాస్థి వ్యాపారి కిడ్నాప్, హత్య

* కిడ్నాప్ చేసి శ్రీశైలం దారిలో హత్య * హత్య వెనుక ఓ ఆధ్యాత్మిక గురువు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణ

Sandeep Reddy
Published on: 7 Aug 2021 1:39 PM IST
A Real Estate Businessman was Kidnapped and Assassinated in Hyderabad
X

స్థిరాస్థి వ్యాపారి (ఫైల్ ఫోటో) 

Hyderabad News: హైదరాబాద్‌లో ఓ స్థిరాస్థి వ్యాపారి కిడ్నాప్, హత్య కలకలం రేపింది. కూకట్‌పల్లిలో ఓ రియల్టర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కూకట్‌పల్లిలో విజయభాస్కర్‌రెడ్డి అనే రియల్టర్ హాస్టల్ లో ఉంటున్నాడు. అయితే నెలరోజుల క్రితం అతను కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో అతని అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు విజయభాస్కర్‌రెడ్డిని హత్య చేసినట్లు గుర్తించారు. అయితే రియల్టర్ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ హత్య వెనుక ఓ ఆధ్యాత్మిక గురువు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story