MGM Hospital: ఎలుకల దాడి ఘటనలో గాయపడిన రోగి మృతి

MGM Hospital: వరంగల్ ఎంజీఎంలో ఎలుకల దాడిలో గాయపడిన కడార్ల శ్రీనివాస్ తెల్లవారుజామున చనిపోయాడు.

Arun Chilukuri
Published on: 2 April 2022 12:23 PM IST
A Rat Nibble Victim Srinivas Passes Away
X

MGM Hospital: ఎలుకల దాడి ఘటనలో గాయపడిన రోగి మృతి

MGM Hospital: వరంగల్ ఎంజీఎంలో ఎలుకల దాడిలో గాయపడిన కడార్ల శ్రీనివాస్ తెల్లవారుజామున చనిపోయాడు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. ఎంజీఎంలో పేషెంట్‌పై ఎలుకలు దాడి చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. స్పందించిన రాష్ట్రప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై చర్యలు తీసుకుంది. ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున శ్రీనివాస్ చనిపోయాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story