Telangana: మరోసారి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తూట్లు

Telangana: సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన పోలీసులు * బొలేరో వాహనం డ్రైవర్‌ పట్ల దురుసు ప్రవర్తన

Sandeep Eggoju
Updated on: 23 March 2021 12:36 PM IST
A Police Attack on a Driver
X

బొలోరో డ్రైవర్ పై సంగారెడ్డి పోలిసుల దాడి 

Telangana: సంగారెడ్డి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ బొలేరో వాహనం డ్రైవర్‌ పట్ల దారుణంగా ప్రవర్తించారు. మానవత్వాన్ని మరిచి అమానుషంగా వ్యవహరించారు. బూటు కాలితో తంతూ, లాఠీలతో చితకబాదుతూ ఆ డ్రైవర్ పై తమ ప్రతాపం చూపారు.

సదాశివపేటకు చెందిన వాజీద్‌ బొలెరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామిగుడి దగ్గర పోలీసులు, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వాజీద్‌ను వెహికల్‌ పక్కకు తీయాలని కోరారు. తన వాహనాన్ని కొంత ముందుకు తీసుకెళ్లి ఆపాడు వాజీద్‌. దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్‌ వాజీద్‌ను దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టాడు. బూటు కాలితో తన్నాడు. ఈ ఘటనలో వాజీద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఓ వైపు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం పలు విమర్శలకు దారితీస్తున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story