Vikarabad: వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి..

Vikarabad: ఉధృతంగా ప్రవహిస్తున్న మల్కాపూర్ వాగు

Shekhar G
Published on: 22 July 2023 9:33 AM IST
A Person Washed Up In A Brook In Vikarabad
X

Vikarabad: వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి.. 

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలుపొంగి ప్రవహిస్తున్నాయి. చీకట్లో నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా.. వాగును దాటే ప్రయత్నంలో పెంటయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెంటయ్యకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ కానరాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. కరణ్ కోట పోలీసులు పెంటయ్య ఆచూకీకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story