Hyderabad: బంజారాహిల్స్‌ పీఎస్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..

A New Twist In The Banjara Hills PS Case
x

Hyderabad: బంజారాహిల్స్‌ పీఎస్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..

Highlights

Hyderabad: డ్యూటీలో లేని ఎస్సైతో పబ్‌పై దాడి చేయించిన సీఐ నరేందర్

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పీఎస్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను విచారించిన ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలను సేకరించారు. ఫిర్యాదు చేసిన పబ్‌పైనే ఉల్టా కేసు పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. డ్యూటీలో లేని ఎస్సైతో సీఐ నరేందర్‌ పబ్‌పై దాడి చేయించాడు. సీపీ ఆనంద్‌కు ఏసీబీ అధికారులు నివేదిక అందించారు. ముగ్గురు నిందితులపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సీఐ నరేందర్‌ వసూళ్ల పర్వం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని రాక్‌క్లబ్‌, స్కైలాంజ్‌ పబ్‌లో జూలై 30న అర్ధరాత్రి ఎస్సై నవీన్‌రెడ్డి నేతృత్వంలో దాడి జరిగినట్లు రికార్డుల్లో ఎంట్రీ చేశారు. జూలై 30న అర్ధరాత్రి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టినట్లు కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో సీఐ నరేందర్‌ పేర్కొన్నారు. జూలై 30న ఎస్సై నవీన్‌రెడ్డి సాయంత్రం 7.గంటల 30 నిమిషాలకే పీఎస్‌ నుంచి వెళ్లిపోయినట్లు ఏసీబీ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరించారు.

రాక్‌క్లబ్‌, స్కైలాంజ్‌ పబ్‌ కింద ఉన్న మరో పబ్‌లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పబ్‌ యాజమాని లక్ష్మణ్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఫిర్యాదు చేసిన స్కైలాంజ్‌ పబ్‌పై ఉల్టా కేసు బనాయించారు. గతంలో రెండు పబ్‌ల మధ్య పార్కింగ్‌ విషయంలో గొడవలు ఉన్నాయి. పబ్‌పై కేసు నమోదు చేసిన సీఐ నరేందర్‌ హోంగార్డు హరి ద్వారా భేరసారాలు చేశారు. సీఐ అక్రమ కేసులు పెట్టి.. వసూళ్లకు పాల్పడుతుండటంతో బాధితుడు లక్ష్మణ్‌రావు ఏసీబీని ఆశ్రయించారు. ఇదే కాకుండా పలు కేసుల్లో సీఐ నరేందర్‌ లంచాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. నరేందర్‌ వసూళ్ల పర్వంలో హోంగార్డు హరి ప్రమేయంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. హరి సిమ్‌ కార్డుపై దృష్టి పెట్టిన అధికారులు ఫోరెన్సిక్‌ ద్వారా వాట్సప్‌ డేటాను సేకరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories