Kamareddy: వేటకు వెళ్లి గుహలో చిక్కుకున్న వ్యక్తి.. నరకయాతన

Kamareddy: కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి అటవీ శివారులో ఘటన

Jyothi
Updated on: 15 Dec 2022 9:28 AM IST
A Man Stuck in Cave At Kamareddy District
X

Kamareddy: వేటకు వెళ్లి గుహలో చిక్కుకున్న వ్యక్తి.. నరకయాతన

Kamareddy: కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి అటవీ ప్రాంత శివారులో ప్రాంతంలో గుహలాంటి ప్రాంతంలో చిక్కుకున్న యువకుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన యువకుడు శాడ రాజు అడవిలో వేటకు వెళ్లి గుహలాంటి ప్రాంతంలో పడి ఇరుక్కున్నాడు. మంగళవారం సాయంత్రం నుంచి గుహలోనే ఉండిపోయాడు. అయితే గుహలో నుంచి అరుపులు వినపడడంతో బుధవారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారుల నేతృత్వంలో రెస్క్యూ బృందం హిటాచీ, జేసీబీలు, తాళ్ల సాయంతో రాజును కాపాడేందుకు యత్నం చేస్తున్నారు. అర్థరాత్రి సైతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా 30 గంటలుగా గుహలో ఇరుక్కున్న రాజు పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. 8 గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Jyothi

Jyothi

Next Story